బాధ్యతలు స్వీకరించిన ఎస్ ఐ.

గోల్డెన్ న్యూస్/ కరకగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం పోలీస్ స్టేషన్‌లో నూతన ఎస్ ఐ గా పి.వి. నాగేశ్వరరావు  బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ ఎస్ఐగా పనిచేస్తున్న రాజేందర్ బదిలీపై టేకులపల్లి వెళ్లడంతో ఆ స్థానంలో నాగేశ్వరరావును నియమించారు. సోమవారం పోలీస్ స్టేషన్ కు చేరుకున్న ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. శాంతి భద్రతల విషయంలో రాజీ లేకుండా పనిచేస్తామన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టిసారిస్తామన్నారు. గుట్కా, పేకాట, ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడే ప్రసక్తేలేదన్నారు. బాధ్యతలు స్వీకరించిన ఎస్సై కి సిబ్బంది అభినందనలు తెలిపారు.

 

 

Facebook
WhatsApp
Twitter
Telegram