గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘భూభారతి’ పోర్టల్ సోమవారం ప్రారంభమైంది.హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో సీఎం రేవంత్‌రెడ్డి ఈ పోర్టల్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రిభట్టి విక్రమార్క, పలువురు మంత్రులు పాల్గొన్నారు. ప్రయోగాత్మకంగా 4 మండలాల్లో ఈ పోర్టల్‌ను అమలు చేయనున్నారు. నారాయణపేట జిల్లా (మద్దూరు). కామారెడ్డి (లింగంపేట్ ), (ములుగు) వెంకటాపూర్, ఖమ్మం (నేలకొండపల్లి) మండలాలను ఎంపిక చేశారు. జూన్ 2 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రజల నుంచి అవసరమైన సూచనలు స్వీకరించి, తగు మార్పులు చేయాలని ముఖ్యమంత్రి ఇప్పటికే అధికారులను ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే స్పందన మేరకు ఎప్పటికప్పుడు పోర్టల్‌ను అప్డేట్ చేయనున్నారు.
Post Views: 31









