గోల్డెన్ న్యూస్ / పినపాక : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏడూళ్ల బయ్యారం పోలీసులు.. ఎస్సై రాజ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం సాయంత్రం ఉప్పాక బ్రిడ్జి వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా పాసింజర్ ఆటోలో గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 1కేజీ 300 గ్రాములు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఇరువురు వ్యక్తులు తొగ్గూడెం గ్రామానికి చెందిన లోకేష్, ఆదిత్యగా గుర్తించారు. వారి వద్ద నుండి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు జరుగుతున్నట్లు ఎస్సై తెలిపారు ఎస్ఐ తెలిపారు.
Post Views: 62