గంట వ్యవధిలోనే భార్య, భర్తలు మృతి!
గోల్డెన్ న్యూస్/ ఖమ్మం : నిండు నూరేళ్లు నీతోడై నడుస్తానని అగ్ని సాక్షిగా ఏడగులు వేసిన సహచరి తనను వదిలి వెళ్లిపోయిందని. భార్య మరణవార్త విన్న ఆ భర్త ఒక్కసారిగా షాక్‌కి గురయ్యాడు. భార్య మరణాన్ని తట్టుకోలేక గంటల వ్యవదిలోనే గుండెపోటుతో మృతి చెందాడు. ఈ విషాదకరమైన ఘటన ఖమ్మం జిల్లాలోని రామచంద్రపురంలో చోటుచేసుకుంది. ఎందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రామచంద్రపురం గ్రామంలో వృద్ధ దంపతులు బాధాటి యశోద (76), హనుమ రెడ్డి ( 81) మృతి చెందారు. భార్య యశోదపై దర్వాజ పడంతో ఆమెకు తీవ్రగాయాలు అయ్యాయి. దీంతో అమెను హాస్పిటల్‌కు తరలించారు. హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. భార్య మరణవార్త విన్న హనుమరెడ్డి (81) షాక్‌కు గురయ్యాడు, గంటల వీధిలోని హనుమారెడ్డి కూడా ప్రాణాలు వదిలాడు.నూరేళ్లు తోడై నడుస్తానని అగ్ని సాక్షిగా ఏడగులు వేసి తన వెంట వచ్చిన భార్య..తనను వదిలి వెళ్లి పోవడంతో హనుమంతు రెడ్డి గుండె చలించిపోయింది. ఎంతో అన్యోన్యంగా ఉండే భార్య మరణాన్ని జీర్ణించుకోలేక హనుమంతు రెడ్డి గుండెపోటుతో చనిపోయాడు. గంటల వ్యవధి లోనే ఇద్దరు వృద్ధ దంపతులు మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.