గోల్డెన్ న్యూస్ /సూర్యాపేట : పట్టణంలో నల్లాలకు నేరుగా మోటార్లు బిగించి నీటిని పట్టుకుంటున్న శ్రీరామ్ నగర్,బాలాజీ నగర్,శ్రీశ్రీ నగర్ ప్రాంత గృహాలలో నల్లాలకు నేరుగా మోటార్లు పెట్టి నీటిని వాడుకుంటున్న గృహాలను మున్సిపల్ సిబ్బంది బుధవారం రైడ్ చెసి 52మోటార్లను సీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కమీషనర్ బి.శ్రీనివాస్ మాట్లాడుతూ మున్సిపాల్టీ నల్లాలకి నేరుగా మోటార్లు పెట్టి నీటిని వాడుకుంటే రూ 5000/-పెనాల్టీ వేయడంతో పాటు మోటార్లు సీజ్ చేసి నల్లా కనక్షన్ శాశ్వతంగా తొలిగించ బడునన్నారు.
Post Views: 22









