గోల్డెన్ న్యూస్ /వెబ్ డెస్క్ :
కేంద్ర ప్రభుత్వం మనదేశంలో తాజాగా టోల్ వసూలు ప్రక్రియలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొని వచ్చింది. మే ఒకటి, 2025 నుంచి జిపిఎస్ ఆధారిత టోల్ వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఎన్ హెచ్ ఎ ఐ ఫాస్ట్ ట్యాగ్ స్థానంలో ప్రభుత్వం ఈ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టనుంది. మనదేశంలో జాతీయ రహదారులపై టోల్ వసూలు ప్రక్రియలో ఒక విప్లవాత్మకమైన మార్పు మే ఒకటి, 2025 నుంచి అమలు కానుంది. ఫాస్ట్ ట్యాగ్ వ్యవస్థను దశలవారీగా తొలగించి దాని స్థానంలో జిపిఎస్ ఆధారిత టోల్ వసూలు ప్రక్రియను నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అమలు చేయనుంది. ఎన్ హెచ్ ఎ ఐ రోడ్డు ప్రయాణాన్ని సులభతరం మరియు వేగవంతం చేయడంతో పాటు పారదర్శకతను తీసుకో రావాలని ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రక్రియను ప్రవేశపెట్టినట్టు తెలుస్తుంది.
ఈ ప్రక్రియ వలన ఇకపై టోలు బూతుల వద్ద వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. దీనివలన కొన్ని సమస్యలు కూడా ఉన్నాయని తెలుస్తుంది. పొడవైన క్యూ లైన్ లు, సాంకేతిక లోపాలు మరియు ట్యాగ్ల దుర్వినియోగం వంటి సమస్యలు ఇప్పటికే తలెత్తుతున్నాయి. ప్రస్తుతం ఉన్న సమస్యలన్నిటిని పరిష్కరించి టోలింగ్ విధానంలో ప్రపంచ ప్రమాణాలను తీసుకురావడమే జిపిఎస్ ఆధారిత టోల్ వ్యవస్థని ప్రవేశపెట్టడానికి ముఖ్య లక్ష్యం అంటూ తెలుస్తుంది. ఇకపై ఆ బండి డ్రైవర్ ఎంత దూరం నడుపుతాడు అనే దానిపై టోల్ వసూలు ఆధారపడి ఉంటుంది.
టోల్ బూత్ల దగ్గర వేచి ఉండాల్సిన అవసరం ఉండదు. మాన్యువల్ ఎర్రర్ లను నివారించే మోస ప్రమాదాన్ని తగ్గించేలా చేస్తుంది. మీకు సున్నితమైన మరియు స్పర్శరహితమైన డ్రైవింగ్ అనుభవాన్ని కలిగిస్తుంది. ప్రస్తుతం అందుబాటులోకి రానున్న జిపిఎస్ ఆధారిత టెక్నాలజీ వాహనాల కదలికలను ట్రాక్ చేస్తుంది. నిజ సమయంలో టోల్ చార్జీలను లెక్కించడానికి ఏఎన్పిఆర్ కెమెరాలు మరియు వాహనంలో అమర్చిన జీపీఎస్ పరికరాలను ఉపయోగిస్తుంది..