గోల్డెన్ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం: ఆన్లైన్-ఆఫ్లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్లు యువత ఉసురు తీస్తున్నాయి. ఎన్నో కుటుంబాలను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టి వారిని చిన్నాభిన్నం చేస్తున్నాయి. క్రికెట్ బెట్టింగులకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ బి. రోహిత్ రాజు పోలీసు అధికారులను ఆదేశించారు. నేర సమీక్షా సమావేశం పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోని సమావేశ మందిరంలో బుధవారం జరిగింది.మార్చి నెలలో విధుల పట్ల అంకితభావంతో పని చేసి ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ల వారీగా పెండింగ్ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. క్రికెట్ బెట్టింగులు, గంజాయి, అక్రమ రవాణా వంటి కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు నేరాలకు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు సైబర్ గురికాకుండా ప్రతి స్టేషన్ పరిధిలోని పట్టణాలు గ్రామాలలో అవగాహన కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలన్నారు. సమావేశంలో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, ఇల్లెందు డీఎస్పీ చంద్రభాను, కొత్తగూడెం డీఎస్పీ షేక్ అబ్దుల్ రెహ్మాన్, పాల్వంచ డీఎస్పీ సతీశకుమార్, డీసీఆర్బీ సీఐ శ్రీనివాస్, ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ నాగరాజురెడ్డి, సైబర్ క్రైమ్ సీఐ సముద్రాల జితేందర్, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
