మద్యం తాగి వాహనం నడిపిన ఒకరికి జైలు శిక్ష. – రూ. 2 వేలు జరిమానా – సూర్యాపేట ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి శ్రీ బివి రమణ ..
గోల్డెన్ న్యూస్/ సూర్యాపేట : మద్యం సేవించి వాహనం నడిపిన ఒకరికి ఒకరోజు జైలు శిక్షతో పాటు రెండు వేల రూపాయల జరిమానా విధించిన సంఘటన గురువారం సూర్యాపేట పట్టణంలో చోటుచేసుకుంది.. సూర్యాపేట ట్రాఫిక్ ఎస్ఐ ఆర్. సాయిరాం తెలిపిన వివరాల ప్రకారం… బుధవారం సూర్యాపేట పట్టణంలోని పలు ప్రాంతాలలో సూర్యాపేట ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించగా మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడిన వారిని గురువారం సూర్యాపేట ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి శ్రీ బి.వి.రమణ గారి ఎదుట ప్రవేశ పెట్టగా సదరు వ్యక్తికి ఒక రోజు జైలు శిక్ష రెండువేల రూపాయల జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు
మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ప్రమాదాల కారణమైతే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సూర్యాపేట ట్రాఫిక్ ఎస్ఐ ఆర్. సాయి రామ్ తెలిపారు. ఒకరు మద్యం సేవించి వాహనం నడపడం వల్ల రెండు కుటుంబాల ప్రమాదం బారిన పడతాయని, ఇరు కుటుంబాలను సమస్య లో కి వెళతాయని తెలిపారు. కావున అహనదారులు ఎవరు మద్యం సేవ