గోల్డెన్ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం : కొత్తగూడెం జిల్లా కోర్ట్ ఆవరణంలో టిపిసిసి లీగల్ సెల్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో గురువారం నిరసన నిర్వహించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ (ED) తప్పుడు ఛార్జ్ షీట్ దాఖలు చేసినందుకు నిరసన కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు.
ఈ కార్యక్రమానికి టీపీసీసీ లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ యాస యుగంధర్ నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ నేతృత్వంలోని మోదీ ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపు కోణంలో ఈ కేసులను రూపొందించింది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ పెట్టిన ఛార్జ్ షీట్లు పూర్తిగా తప్పుడు ఆధారాలపై ఆధారపడి ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీని అడ్డుకోవడమే వారి లక్ష్యమని విమర్శించారు. తక్షణమే సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై నమోదైన అక్రమ కేసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే దేశవ్యాప్తంగా లీగల్ సెల్ ఆధ్వర్యంలో పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ భాగం మాధవరావు, వై.వి. రామారావు, ఎన్. నరసింహచారి, ఎస్. అంకుష్ పాషా, దుడెం మురళీకృష్ణ, కె. రాము, ఎస్. కోటేశ్వరరావు, జగదీష్, ధనలక్ష్మి, పాటి మౌనిక, మహేష్ ఆనంద్, ఎస్. భార్గవ్ తదితరులు పాల్గొన్నారు.