గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్ : ఏఐసీసీ. అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ పేర్లను నేషనల్ హెరాల్డ్ ఛార్జ్ షీట్ లో చేర్చడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ధర్నా చేపట్టారు. ఏఐసీసీ పిలుపు మేరకు ఎల్బషీర్ బాగ్ లోని ఈడీ కార్యాలయం వద్ద ఆందోళనకు గురువారం దిగారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశౌగౌడ్ నేతృత్వంలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం, ఈ డీ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Post Views: 17