గోల్డెన్ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ భారతి ఆర్ఎఆర్ చట్టంలోని హక్కులు, భూ సమస్యల పరిష్కారంపై ఆఫీసర్లు పూర్తి అవగాహన కలిగి ఉండాలని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. గురువారం జిల్లాలోని గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూ భారతి చట్టం లోని అంశాలు, హక్కులపై ప్రజలకు అవగాహన కల్పించారు ప్రతి అధికారి ఖచ్చితమైన అవగాహన ఉండాలన్నారు.ఏదైనా పట్టా మార్పిడిపై ధరణి పోర్టల్లో అప్పీల్ చేసుకునే అవకాశం లేదని, కానీ భూ భారతి చట్టంలో అప్పీల్ చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. తహసీల్దార్లకు అప్పీల్ చేసుకుని, అధికారి ఇచ్చిన జడ్జిమెంట్ పై కలెక్టర్కు, సీసీఎల్ ఏకు అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించినట్లు చెప్పారు. ప్రతి పట్టా మార్పిడికి సర్వేయర్లు మ్యాప్ జత చేయాల్సి ఉంటుందని, ఈ అంశాలపై గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.