సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు…వక్ఫ్ సవరణ చట్టంపై వాదనలు..

సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు…వక్ఫ్ సవరణ చట్టంపై వాదనలు..

పార్లమెంట్ ఆమోదం పొందిన వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ.. దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం విచారణ చేపట్టింది.

 

అందులోభాగంగా సుప్రీంకోర్టులో వాదనలు ప్రారంభమైనాయి. అయితే వక్ప్ చట్టంలోని కొన్ని అంశాలపై స్టే ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇస్తామని బుధవారం సిజెఐ ధర్మాసనం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం తరపున ఎస్ జి తుషార్ మెహతా వాదిస్తున్నారు. ఆ క్రమంలో కొన్ని సెక్షన్లను మాత్రమే చదివి నిర్ణయం తీసుకోవద్దని ఆయన ధర్మాసనాన్ని కోరారు.

 

ఈ విషయంలో అనేక సవరణలు,కమిటీల ఏర్పాట్లు,లక్షల సంఖ్యలో అభ్యర్థనలు ఉన్నాయని గుర్తు చేశారు. గ్రామాలకు గ్రామాలను వక్ప్ ఆస్తులుగానూ, వ్యక్తిగత ఆస్తులను తీసుకున్నారని వివరించారు. ఇది ప్రజలపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ స్టే ఇవ్వడం కఠినమైన నిర్ణయం అని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దయచేసి తనకు ఒక వారం సమయం ఇవ్వాలని ధర్మాసనాన్ని కోరారు. అలాగే తన వాదనలతో పాటు డాక్యుమెంట్లను సమర్పించడానికి సైతం అనుమతించాలని విజ్జప్తి చేశారు.

 

ఆ వెంటనే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ స్పందిస్తూ.. మేము పరిస్థితి మారిపోవాలని కోరుకోవడం లేదన్నారు. ఐదేళ్ల వరకు ప్రొవిజెన్స్ ఉన్నాయని తమకు తెలుసునని స్పష్టం చేశారు… వాటిని తాము స్టే చేయడం లేదని స్పష్టం చేశారు. చీఫ్ జస్టిస్ వ్యాఖ్యలపై ఎస్ జీ తుషార్ మెహతా స్పందిస్తూ.. దయ చేసి తమ వాదనను వినాలని కోరారు. ఒక వారం రోజుల్లో ఎలాంటి మార్పు ఉండదని పేర్కొన్నారు. అలాగే తాము ఎలాంటి నియామకాలు చేయమని ధర్మాసనానికి విన్నవించారు.

 

ఇంతలో చీఫ్ జస్టిస్ జోక్యం చేసుకొని .. తదుపరి విచారణ వరకు ఎలాంటి మార్పులు వద్దన్నారు. దీంతో ఎస్ జీ తుషార్ మెహతా స్పందిస్తూ.. ఏ రాష్ట్రం అయినా.. నియామకాలు చేస్తే.. అవి చట్టబద్దమైనవిగా పరిగణించకూడదన్నారు. తాను ఈ ప్రకటన చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. దీంతో కౌంటర్ దాఖలు చేయడానికి సుప్రీంకోర్టు ధర్మాసనం వారం రోజులు సమయం ఇచ్చింది.

 

అలానే తదుపరి విచారణ తేదీ వరకు ఎలాంటి నియామకాలు జరగకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇక తదుపరి విచారణ తేదీ వరకు.. యూజర్ వై వక్ఫ్‌గా పర్కొన్నవాటితోపాటు నోటిఫికేన్ ద్వారా రిజిస్టర్ చేయబడినవి.. డీ నోటిఫై చేయకూడదంటూ సుప్రీం కోర్టు ఆదేశించింది.

 

మరోవైపు.. అంత వరకు వక్ఫ్ ఆస్తుల్లో ఎటువంటి మార్పులు చేయవద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వర్క్ బోర్డులో ఎటువంటి నూతన నియామకాలు చేయొద్దని సూచించింది. ఇక వక్ఫ్ సవరణ చట్టంపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. పిటిషనర్లు లేవనెత్తిన అంశాలపై వారం రోజుల్లో వివరణాత్మక సమాధానం ఇవ్వాలని కేంద్రానికి సుప్రీంకోర్టు స్పష్టంగా సూచించింది.

Facebook
WhatsApp
Twitter
Telegram