అనుమానస్పద స్థితిలో కానిస్టేబుల్ మృతి

గోల్డెన్ న్యూస్ / కామారెడ్డి : అనుమానాస్పద స్థితిలో ఓ కానిస్టేబుల్ మృతి చెందిన సంఘటన శుక్రవారం కామారెడ్డి జిల్లా పిట్లం మండలం సిద్ధాపూర్ చోటు చసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం దుర్కి గ్రామానికి చెందిన బుచ్చయ్య (35) సిద్ధాపూర్ చెరువు కట్ట వద్ద మిగతాజీవిగా పడి ఉండగా స్థానికులు  పోలీసులకు సమాచారం అందించారు. బుచ్చయ్య రాత్రివేళ బైక్ పై ప్రయాణిస్తూ ప్రమాదానికి గురయ్యాడా లేక మరేదైనా జరిగి ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బైక్ చెట్టును ఢీకొట్టడం వల్ల ప్రమాదం జరిగి ఉండవచ్చు  పోలీసులు అనుమానిస్తున్నారు.  కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్టు పిట్లం  ఎస్సై రాజు తెలిపారు. రెండు సంవత్సరాలుగా బుచ్చయ్య పిట్లం పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. బుచ్చయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.

Facebook
WhatsApp
Twitter
Telegram