భూ భారతితో ప్రతి రైతుకు భద్రత.. కలెక్టర్ జితేష్ వి పాటిల్

గోల్డెన్ న్యూస్ / కరకగూడెం : భూ సమస్యల పూర్తి పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని భద్రాద్రి కొత్తగూడెం  జిల్లా  కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. శుక్రవారం కరకగూడెం మండల కేంద్రంలో నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సు కార్యక్రమంలో ఆర్డీవో దామోదర్ తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూ భారతితో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న భూ సమస్యలు పరిష్కరమవుతాయన్నారు. జిల్లాలో ఏప్రిల్ 17 నుంచి 30 వరకు భూ భారతిపై అవగాహన కల్పించేందుకు సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. గతంలో ధరణి ఉన్నప్పుడు తప్పులు దొర్లిన అంశాలపై భూభారతి ద్వారా అప్పీల్ చేసుకోవచ్చాన్నారు.ఈ సందర్భంగా కుర్నవల్లి గ్రామానికి చెందిన చందా  లక్ష్మీనారాయణ అనే రైతు వంశపారపర్యంగా వచన భూమిలో  తాను కాస్త లో ఉన్నాను కానీ నాన్న కొడుకు ఆ పొలాన్ని పట్టా చేయించుకున్నాడని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఇంకొక రైతు తనకు గతంలో 1,2 సర్వే నెంబర్లలో  మూడు ఎకరాలు పట్టా పొలం ఉండగా అదే సర్వే నెంబర్ తో ప్రభుత్వం భూమి కూడా ఉందని చెప్పి అప్పటి వీఆర్వో పట్టాను రద్దు చేశారని అనంతారం గ్రామానికి చెందిన రైతు శ్రీరామ్ చంద్రయ్య కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చాడు. తహసీల్దార్ చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా పని కాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. స్పందించిన కలెక్టర్ సమస్య త్వరలో పరిష్కారమవుతుందన్నారు. ఆదివాసి సంఘానికి చెందిన నాయకులు మండలంలో అక్రమ  ఇసుక రవాణా జరుగుతుందని కలెక్టర్ దృష్టికి తీసుకురాగా స్పందించిన ఆయన అక్రమ ఇసుక రవాణా అరికట్టాలని తాసిల్దార్ ఆదేశించారు. ఆదివాసి సంఘం నాయకుడు ఆర్కే దొర ఏజెన్సీలో 170 చట్టం అమలు చేయాలని కోరారు. ఈ సదస్సులో తహసీల్దార్ నాగ పసాద్, ఇన్చార్జ్ ఎంపీడీవో కుమార్, ఏ డి ఓ తాతారావు, రైతులు పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram