వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధం

వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధం అంశంపై జరుగు సెమినార్ జయప్రదం చేయండి…

సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి పిలుపు….

గోల్డెన్ న్యూస్ / సూర్యాపేట :ఈ నెల 22వ తేదీన సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎంజీ రోడ్ లో గల మమత బాంకెట్ హాలులో *వక్ఫ్ సవరణ చట్టం 2025 రాజ్యాంగ విరుద్ధం* అంశంపై జరుగు సెమినార్ ను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి పిలుపునిచ్చారు. ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పొట్టి శ్రీరాములు సెంటర్లో సెమినార్ కు సంబంధించిన కరపత్రాలను ముస్లిం మైనారిటీలతో కలిసి విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం 2025 వక్ఫ్ సవరణ చట్టాన్ని ఆమోదించి ముస్లిం మైనార్టీలకు తీవ్రమైన అన్యాయం చేసిందన్నారు. సవరించిన చట్ట ప్రకారం మైనార్టీలకు వక్ఫ్ ఆస్తులపై ఎలాంటి హక్కులు లేకుండా చేయాలని కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిందన్నారు. ముస్లిమేతరులను వక్ఫ్ బోర్డులో సభ్యులుగా చేర్చడం అంటే వారి హక్కులను హరించి వేయడమేనని అన్నారు. రాజ్యాంగంలో సమానత్వాన్ని, మత స్వేచ్ఛను సమాధి చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందని అన్నారు. చట్ట ప్రకారం తమ ఆస్తులను వక్ఫ్ చేయాలంటే ఐదు సంవత్సరాలు ఇస్లాం ను ఆచరించాలని షరతు విధించడం సరికాదని అన్నారు. ఏ మత ధార్మిక సేవా కార్యక్రమాలకు లేని షరతులు ముస్లిం మతానికి,వక్ఫ్ బోర్డు కు పెట్టడం దుర్మార్గం అన్నారు. దేశంలో ఏదో ఒక పేరుతో ముస్లిం మైనారిటీలపై దాడులు చేయడమే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తుందని అన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచిన సమానత్వం,మత స్వేచ్ఛ, జీవించే హక్కు,సాంస్కృతిక హక్కు,ఆస్తి హక్కు, మైనారిటీల హక్కులను హరించి వేసే విధంగా రాజ్యాంగంలోని 8 ఆర్టికల్స్ ను ఉల్లంఘించే విధంగా ఉన్న 2025 వక్ఫ్ సవరణ చట్టాన్ని అందరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రాజ్యాంగ, ముస్లిం మైనార్టీ,దళిత, ఆదివాసి వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిపిఎం ఆధ్వర్యంలో ఈనెల 22వ తేదీన సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఈ సెమినారు నిర్వహించడం జరుగుతుందని అన్నారు.ఈ సెమినార్కు ముస్లిం మైనార్టీలు,ప్రజాతంత్ర వాదులు,మేధావులు, అభ్యుదయవాదులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సెమినార్ కు ముఖ్య అతిథులుగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి అబ్బాస్ హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్ ముస్లిం మైనారిటీ నాయకులు ఫక్రుద్దీన్, మౌలానా అస్రార్ సాహెబ్ సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ములకలపల్లి రాములు, కోట గోపి ఆవాజ్ జిల్లా అధ్యక్షులు సయ్యద్ షాకీరా హుస్సేనీ,కార్యదర్శి షేక్ జహంగీర్ సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మేకనబోయిన శేఖర్ జే నరసింహారావు దనియాకుల శ్రీకాంత్, సీపీఎం జిల్లా నాయకులు చినపంగి నరసయ్య, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అక్కినపల్లి వినయ్ ముస్లిం మైనారిటీలు రఫీ, ఇమామ్,రఫీయుద్ధన,ఇమ్రాన్, ముఫ్తీ అబ్రార్ సాహెబ్,చాంద్ పాషా, బాసిత్ భాయ్,జలీల్ బాయ్,మౌలానా అబ్దుల్ రహీం,మలిక్,షఫీ,ముజుహర్ సుబాన,లతీఫ్,మునీర్,జూనైద్ నాయబ్,జాకీర్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram