గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు మృతి .
గోల్డ్ న్యూస్ / ఆంధ్రప్రదేశ్ :అనాసాగరం హైవే పై నడుచుకుంటూ వెళుతున్న ఇద్దరు వ్యక్తులను గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటన
ఈ ఘటనలో అక్కడికక్కడే ఇద్దరు వ్యక్తులు మృతి చెంది శరీర భాగాలు చిందరవందరగా తెగిపడినవి
మృతులు జగ్గయ్యపేట మండలం వేదాద్రి గ్రామానికి చెందిన పసుమర్తి భాస్కరరావు రుద్రపోగు వెంకటేశ్వర్లుగా సమాచారం .
వీరు నిన్న సాయంత్రం వేదాద్రి గ్రామం నుండి యేసుక్రీస్తు మాలదరించి గుణదల మేరీ మాత చర్చికి కాలిబాటన బయలుదేరారు
గత రాత్రి అనాసాగరం ఫ్లైఓవర్ వద్దకు గాలి బాటన వస్తున్న వీరిని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టి ఆగకుండా వెళ్ళినట్లుగా సమాచారం
ఘటనా స్థలం వద్దకు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.మృతదేహాన్ని నందిగామ మార్చ రీకి తరలించారు.
Post Views: 12