గోల్డెన్ న్యూస్ /హైదరాబాద్ : నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షంకురుస్తోంది. ఎస్ఆర్ నగర్, బోరబండ, జూబ్లీహిల్స్, కోఠి, నాంపల్లి, హిమాయత్నగర్, కార్వాన్, కుత్బుల్లాపూర్, వనస్థలిపురం తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సాయంత్రం వేళ ఇళ్లకు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల ట్రాఫిక్ నిలిచిపోయింది.నాంపల్లి రెడీహిల్స్ రోడ్డుపై ఓ భారీ వృక్షం కూలిపోయి ట్రాన్స్ఫార్మర్పై పడింది. దీంతో అది ఒక్కసారిగా పేలిపోయింది. అస్మాస్గఢ్ విద్యుత్ డివిజన్ పరిధిలో 67 ఫీడర్లు ట్రిప్ అయ్యాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ పనుల్లో జాప్యం చోటు చేసుకుంది. బషీర్బాగ్లో పీజీ లా కాలేజ్ ఎదుట రోడ్డుపై ఓ చెట్టు కూలిపోయింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ట్యాంక్ బండ్ నుంచి లోయర్ ట్యాంక్బండ్ వెళ్లే రోడ్డులో చెట్టు కూలిపోయి.. వాహనాలు భారీగా నిలిచిపోయాయి. లంగర్ హౌస్ బాపునగర్ కాలనీలో చెట్టు కూలి.. రెండు విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి.
