వక్ఫ్‌బోర్డు చట్టం సవరణకు వ్యతిరేకంగా శుక్రవారం ఇల్లందు లో ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని నిమ్మబావిగడ్డ
గోల్డెన్ న్యూస్ / ఇల్లెందు : ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో చట్టం చేసిన వర్ఫ్ సవరణ బిల్లును దేశవ్యాప్తంగా ముస్లింలు, ముస్లిం సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం జూమా నమాజ్ తరవాత ఇల్లందు,గుండాల మండలంలో మజీద్ కమిటీలు ముస్లిం సంఘాలు భారీ ర్యాలీ నిరసన కార్యక్రమలు నిర్వహించాయి. ఇల్లేందు లో భారీ ర్యాలీ ఇంద్రనగర్ నుండి పాత బస్టాండ్ స్టేషన్ భాస్తీ మీదుగా కొనసాగింది.. వక్స్ చట్టంతో వర్ఫ్ ఆస్తులను నాశనం చేయడానికి, వక్స్ ఆస్తులను బీజేపీ, ఆర్ఎస్ఎస్ సంఘాలకు కట్టబెట్టడానికి మోడీ కుట్ర చేస్తున్నారని పలు ముస్లిం సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. వెంటనే ఈ బిల్లును విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు. అయితే కేంద్రం తీసుకొచ్చిన ఈ చట్టానికి వ్యతిరేకంగా ఇప్పటికే కేరళ, తమిళనాడు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్నాయి,ఈ కార్యక్రమంలో మసీద్ కమిటీలు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.