వక్ఫ్‌బోర్డు చట్టం సవరణకు వ్యతిరేకంగా శనివారం కరకగూడెంలో ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు.
గోల్డెన్ న్యూస్ / కరకగూడెం: వక్ఫ్ చట్టం సవరణ బిల్లుకు వ్యతిరేకంగా కరకగూడెం సెంటర్లో ముస్లింలు శనివారం నిరసన ప్రదర్శన చేశారు. అనంతరం చేతులకునల్ల బ్యాండులు కట్టుకుని, పకార్డులు పట్టుకుని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బిల్లు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మండల మైనార్టీ నాయకులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్, సిపిఎం మండల కార్యదర్శి కొమరం కాంతారావు మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ ప్రభుత్వం మతాలవారీగా చిచ్చు పెట్టాలని చూస్తుందని విమర్శించారు. వక్ఫ్ భూములను కాజేయడానికి కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వక్ఫ్ ఆస్తులను బీజేపీ, ఆర్ఎస్ఎస్ సంఘాలకు కట్టబెట్టడానికి మోడీ కుట్ర చేస్తున్నారని ముస్లిం సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. వెంటనే ఈ బిల్లును విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి వెళ్లి తాసిల్దార్ కార్యాలయంలో వక్ఫ్ బిల్లును వెంటనే రద్దు చేయాలని. వినతి పత్రం అందజేశారు..అయితే కేంద్రం తీసుకొచ్చిన ఈ చట్టానికి వ్యతిరేకంగా ఇప్పటికే కేరళ, తమిళనాడు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్నాయి,ఈ కార్యక్రమంలో మండలంలోని 4 మసీద్ కమిటీల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.