మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య.

గోల్డెన్ న్యూస్ / వరంగల్ : కాజీపేట దర్గా ప్రాంతంలో ఘటన. అర్చన అనే మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడింది. 2022 లో వివాహం జరిగి కొద్దిరోజులకే విడాకులు అయినట్లు స్థానికులు చెబుతున్నారు. అప్పటినుంచి మానసికవేదనకు గురవుతూ జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. కానిస్టేబుల్ అర్చన కొద్దిరోజులుగా డ్యూటీకి సెలవు పెట్టి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతోంది.

 

పెండ్లి సంబంధాలు కుదరడం లేదని మనస్తాపంతో జనగామ జిల్లా కొడకండ్ల మండలం నీలిబండ తండాకు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ గుగులోతు లీల (26) సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. ఆ ఘటన తర్వాత శనివారం అర్చన అనే మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకుంది. మహిళా కానిస్టేబుళ్ల వరుస ఆత్మహత్యలతో పోలీసువర్గాలను ఆందోళనకు గురి చేస్తోంది.

 

అర్చన ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించగా, కుటుంబ సభ్యులు, సన్నిహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మానసిక ఒత్తిడికి గురయ్యే పోలీస్ సిబ్బందికి మద్దతు, కౌన్సెలింగ్ వంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

 

 

Facebook
WhatsApp
Twitter
Telegram