ఈ నెల 22న ఇంటర్ ఫలితాలు.

గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్, తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు ఈ నెల 22న ఇంటర్మీడియట్ పాఠశాల రెండో సంవత్సరం పరీక్షల ఫలితాలను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ ఫలితాలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు విద్యాశాఖ మంత్రి భట్టి విక్రమార్క విడుదల చేయనున్నారు.

 

ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండవ సంవత్సర పరీక్షలు మార్చి 5 నుండి 25వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించబడ్డాయి. పరీక్షల నిర్వహణ అనంతరం సమీక్ష ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసిన అధికారులు త్వరితగతిన ఫలితాల విడుదలకు సన్నద్ధమయ్యారు.

 

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు తమ ఫలితాల కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఫలితాలను ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా పొందుపరచనున్నారు. విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ ఆధారంగా ఫలితాలను పరిశీలించవచ్చు.

 

అధికారుల సమాచారం ప్రకారం, ఫలితాలు విడుదలైన అనంతరం రీవెరిఫికేషన్, రీ కౌంటింగ్, సప్లిమెంటరీ పరీక్షల వివరాలను కూడా ప్రకటించనున్నారు. విద్యార్థులు సంబంధిత వివరాలను బోర్డు వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

 

Facebook
WhatsApp
Twitter
Telegram