గోల్డెన్ న్యూస్ / ఎదులాపురం : దివ్యాంగుల సంక్షేమమే ధ్యేయంగా ప్ర భుత్వం పని చేస్తోందని మంత్రి సీతక్క తెలిపారు. శనివారం ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో దివ్యాంగులకు ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దివ్యాంగుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.50 కోట్ల నిధులను కేటాయించిందన్నారు. ఈ నిధులతో వారికి ఆర్థిక భరోసా కలుగుతుందన్నారు. దివ్యాంగులకు విద్య, ఉపాధి రంగాల్లో రిజర్వేషన్ అమలు చేస్తున్నామని మంత్రి చెప్పారు.
Post Views: 21