ఒకే కాన్పులో ముగ్గురి జననం
తల్లి పిల్లలు క్షేమం…
డాక్టర్ విజిత గిరిధర్ రెడ్డి
గోల్డెన్ న్యూస్ / సూర్యాపేట : సూర్యాపేట మండల పరిదిలోని రాయినిగూడెం గ్రామానికి చెందిన షేక్ షబానా( 22 ) మూడు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది, నాటి నుంచి సంతానం కోసం అనేక హాస్పిటల్స్ తిరిగి అనేక ఇబ్బందులు పడ్డారు.. చివరగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీహాన్ హాస్పిటల్ లో సంతాన చికిత్స పొంది చివరకు గర్భం దాల్చారు. ఆమెకు బిపి, షుగర్ థైరాయిడ్ తో భాధపడుతూ ఉండటం వలన శ్రీహన్ హాస్పిటల్ డాక్టర్. విజితగిరిధర్ రెడ్డి హైరిస్కు ప్రెగ్నెన్సీ గా అడ్మిట్ చేసుకొని సిజరిన్ చేయగా ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు జన్మించడం జరిగింది (ఇద్దరు మగ శిశువులు ఒక ఆడ శిశువు. 1.8 1.5 1.5) కేజీల బరువు ఉన్నట్లు చెప్పారు… గతంలో కూడా ఎన్నో హైరిస్కు కేసులు చేసి అందరి మన్ననలు పొందారు… శనివారం తల్లి బిడ్డలను సురక్షితంగా డిస్చార్జ్ చేసినట్లు తెలిపారు. ఈలాంటి కాన్పులు చాలా అరుదుగా జరుగుతుంది అని డాక్టర్.విజిత గిరిధర్ రెడ్డి చెప్పారు తల్లి పిల్లలు ఆరోగ్యంగా ఉన్నట్టు శ్రీహాన్ హాస్పిటల్ డైరెక్టర్. డాక్టర్ గిరిధర్ రెడ్డి తెలిపారు వారి బంధు మిత్రులు సంతోషం వ్యక్తం చేస్తూ డాక్టర్ విజితగిరిధర్ రెడ్డి కీ కృతజ్ఞతలు తెలిపారు.