యువకుడి పై కత్తితో దాడి.

గోల్డెన్ న్యూస్ /హైదరాబాద్: నగరంలోని చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి దారుణ హత్య జరిగింది. స్కూటీ పై వెళ్తున్న మనోజ్ (24) అనే యువకుడిపై గుర్తుతెలియని వ్యక్తి కత్తితో దాడి చేసి హతమార్చాడు.

 

పోలీసుల కథనం మేరకు, మనోజ్ అనే వ్యక్తి రాత్రి సమయంలో తన స్కూటీపై వెళ్తుండగా, గుర్తుతెలియని వ్యక్తి అతడిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

 

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. హత్యకు కారణాలు ఏమిటో ఇంకా తెలియరాలేదు.

 

పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్‌లు పరిశీలిస్తూ, నిందితుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Facebook
WhatsApp
Twitter
Telegram