గోల్డెన్ న్యూస్ / ఇల్లందు : భూ భారతి చట్టంతో ప్రజలకు మేలు జరుగుతుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ అన్నారు. ఇల్లందు మండలం బొజ్జాయిగూడెంలో ఆదివారం భూ భారతి చట్టం 2025 పై కలెక్టర్.. ఎమ్మెల్యే కోరం కనకయ్య, అధికారులతో కలిసి ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ.. గతంలో భూ సమస్యలు పరిష్కారం కావాలంటే ప్రజలు సంబంధిత కార్యాలయాలు, కోర్టులను ఆశ్రయించాల్సి వచ్చేదని. ఇక నుంచి చిన్నచిన్న సమస్యలు తహసీల్దారు ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి పరిశీలనతో పరిష్కారమవుతాయని చెప్పారు. అనంతరం స్థానిక రైతులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఆర్డీఓ మధు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
Post Views: 30