స్టీరింగ్ రాడ్ విరిగి అదుపుతప్పిన బస్సు
గోల్డెన్ న్యూస్ /సూర్యాపేట : చింతలపాలెం వద్ద ఆర్టీసీ బస్సు బోల్తాపడింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ద్విచక్ర వాహనాన్ని తప్పించే క్రమంలో ఆర్టీసీ బస్సు స్టీరింగ్ రాడ్డు విరిగి.. అదుపు తప్పి బోల్తా పడింది. అక్కడే ఉన్న స్థానిక యువకులు బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీసి.. హుజూర్నగర్, కోదాడ ఏరియా ఆస్పత్రులకు తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 25 మంది ప్రయాణికులు ఉన్నారు. ఆర్టీసీ బస్సు కోదాడ నుంచి చింతలపాలెం వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
Post Views: 38