సీఎం వస్తేనే పెళ్లి చేసుకుంటానంటున్న యువకుడు..

గోల్డెన్ న్యూస్ /ఖమ్మం : ఓ కాంగ్రెస్ కార్యకర్తకు  సీఎం అంటే ఎంత అభిమానం  సీఎం రేవంత్ రెడ్డి తన పెళ్లికి వస్తేనే పెళ్లి ముహూర్తం పెట్టుకుంటానని ఓ యువ కాంగ్రెస్ కార్యకర్త భీష్మించి కూర్చున్నాడు. సీఎం రేవంత్ రెడ్డి వస్తేనే పెళ్లి చేసుకుంటా.. లేదంటే పెళ్లి పీఠలెక్కను.. అంటూ ఓ యువకుడు ఎమ్మెల్యేకు వినతి పత్రం అందించడం ఖమ్మం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం మేకల తండ గ్రామానికి చెందిన భూక్య గణేష్‌కు సీఎం రేవంత్‌ రెడ్డి అంటే అభిమానం. ఆ అభిమానం ఏ స్థాయికి వెళ్లిందంటే.. తన పెళ్లికి సీఎం రేవంత్ రెడ్డి హాజరైతేనే పెళ్లి చేసుకుంటానంటున్నాడు. సీఎం రేవంత్ రెడ్డికి ఎప్పుడు టైం కుదిరితే అప్పుడే ముహూర్తం పెట్టుకుంటానని చెబుతున్నాడు. బంధువులు ఎంత చెప్పినా వినకుండా భీష్మించి కూర్చున్నాడు. ముఖ్యమంత్రి టైం ఇవ్వకపోతే పెళ్లి చేసుకోనని మొండికేశాడు. అంతేకాదు సీఎం రేవంత్ రెడ్డితో పాటు జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు కూడా తన పెళ్లికి హాజరయ్యేలా చూడాలని కోరుతూ.. వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్‌కు వినతి పత్రం అందించాడు.

 

Facebook
WhatsApp
Twitter
Telegram