గోల్డెన్ న్యూస్ / జనగామ : చిల్పూర్ మండలం, తహశీల్దార్ కార్యాలయంలో, రూ. 26 వేలు డిమాండ్ చేసి, స్వీకరించినందుకు తెలంగాణ అనీశా అధికారులు పట్టుకున్నారు. ఫిర్యాదుదారు మరియు అతని సోదరుడికి సంబంధించిన ఒక మ్యుటేషన్ ఫైల్‌లో ఫీల్డ్ వెరిఫికేషన్ రిపోర్ట్‌ను సమర్పించడం కోసం మరియు తహశీల్దార్ ద్వారా ప్రాసెస్ చేయడం కోసం అధికారిక సహాయం చేయడానికి ఫిర్యాదుదారు నుండి రూ.26,000.తీసుకుంటుండగా తెలంగాణ అనిశా అధికారులకు పట్టుబడిన జనగాం జిల్లా చిల్పూర్ మండలం, తహశీల్దార్ కార్యాలయంలోని R.I. వినీత్ కుమార్.
ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ అవినీతి నిరోధక శాఖ వారి “టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి”. అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన “వాట్సాప్( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB) మరియు ఎక్స్ (TelanganaACB)” ద్వారా కూడా తెలంగాణ అనిశా ను సంప్రదించవచ్చును.