కలెక్టర్ కు అరుదైన గౌరవం

అదిలాబాద్ జిల్లా కలెక్టర్ కు అరుదైన గౌరవం

గోల్డెన్ న్యూస్ / అదిలాబాద్ : సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా సోమవారం అరుదైన పురస్కారం అందుకున్నారు.

 

జాతీయస్థాయిలో అత్యు న్నత గౌరవం దక్కింది. సోమవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ నార్నూర్ మండ లానికి జాతీయస్థాయి ఆస్పిరేషనల్ పురస్కారాన్ని కలెక్టర్ రాజార్షి షాకు అందజేశారు.

 

బ్లాక్ ఆస్పిరేషన్ ప్రోగ్రాంలో భాగంగా దేశంలోని మారుమూల ప్రాంతాలైన 426 బ్లాక్ లను ఎంపిక చేయగా, వాటిలో టాప్ -5 లో నార్నూర్ మండలం ఉన్నత స్కోరును సాధించింది. పరిపాలన విభాగంలో అద్భుత ప్రగతి సూచికలకు అనుగుణంగా ప్రతి ఏటా అత్యున్నత పురస్కారాన్ని కేంద్రం అందిస్తోంది.

 

ప్రధానమంత్రి ప్రజాస్వామ్య పరిపాలన ఉత్తమ పురస్కారం’- 2024 కింద తెలుగు రాష్ట్రాల నుండి ఆదిలాబాద్ కలెక్టర్ అరుదైన అవార్డును అందుకోవడం విశేషం.

 

పాలన అంశాల్లో నార్నూర్ అద్భుతమైన ప్రగతి..!

ప్రగతిశీల బ్లాక్ ప్రోగ్రాం కింద కిందటేడాది దేశంలోని మారుమూల ప్రాంతాల్లోlr నవంబర్ 26 బ్లాక్ లను కేంద్రం ఎంపిక చేసింది. కేంద్ర రాష్ట్రాల నిధులతో పాటు సి ఎస్ ఆర్ నిధులను ఈ మండలానికి వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలను కలెక్టర్ వేగిర పరిచారు.

 

క్షేత్రస్థాయిలో మారుమూల గిరిజన గ్రామాలను కలెక్టర్ క్షేత్రస్థాయిలో సందర్శిస్తూ అభివృద్ధి సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలుపరిచారు.

 

జాతీయస్థాయి ప్రగతి సూచికల్లో ఐదవ స్థానాన్ని, తెలుగు రాష్ట్రాల్లో నార్నూర్ మండలం ఆస్పిరేషనల్ అవార్డు కింద మొదటి స్థానంతో గౌరవం దక్కిం చుకొని అరుదైన అవార్డును సాధించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.

Facebook
WhatsApp
Twitter
Telegram