కార్యకర్తలకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది..కవిత

గోల్డెన్ న్యూస్ / భద్రాచలం : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ నేతలకు మధ్య  తాను ఉంటానని.. కార్యకర్తల సమస్యలను ఎప్పటికప్పుడు కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్సీ కవిత అన్నారు. భద్రాచలంలో భారాస కార్యకర్తలు, ఉద్యమకారుల సమావేశంలో కవిత పాల్గొని మాట్లాడారు. చిన్న అవసరమున్నా కార్యకర్తలు తనను సంప్రదించవచ్చు. అన్నారు. కార్యకర్తలను కాపాడుకోవడాన్ని బాధ్యతగా భావిస్తా. తెలంగాణను కాపాడటమే భారాస ప్రథమ కర్తవ్యం. కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణను కాపాడే బాధ్యత భారాసకే ఉంటుందన్నారు. ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు మంత్రులున్నా మూడు పైసలు కూడా తేలేదు. ఆత్మీయ భరోసా కింద నిరుపేదలకు డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను సమీకరించాల్సిన అవసరం ఉందిని అన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram