ఘన స్వాగతం పలికిన భద్రాద్రి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు , బిఆర్ఎస్ పార్టీ నాయకులు… మణుగూరు బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం జెండా ఆవిష్కరణ చేసిన కవిత
గోల్డెన్ న్యూస్ / మణుగూరు : ప్రజలకు పార్టీకి మధ్య అనుబంధం తప్పకుండా ఉండాలని,ఉద్యమకారులు మరియు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరిలో ఉత్తేజం నింపడానికి వాళ్లందర్నీ కలిసి వాళ్లలో ఉద్యమ ఉత్సాహాన్ని ఎల్లప్పుడూ ఉండేలా కృషి చేస్తామని కల్వకుంట్ల కవిత తెలిపారు.
బిఆర్ఎస్ పార్టీ 27వ తేదీన నిర్వహించబోయే రజతోత్సవ ఉత్సవాలను జయప్రదం చేయాలని వాడవాడల నుంచి జనం,జన సముద్రంలా కదలి రావాలని రజతోత్సవ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కవిత బిఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు పిలుపునిచ్చారు
అనంతరం పవన్ నాయక్ ప్రతాప్ ఏర్పాటుచేసిన తేనీటి విందులో పాల్గొని,అనంతరం ఎక్సలెంట్ విద్యా సంస్థల చైర్మన్ యూసఫ్ ఏర్పాటుచేసిన భోజన కార్యక్రమంలో పాల్గొన్నారు…
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ పాల్గొని ఎంతో విజయవంతం చేశారు…