పెండింగ్ బిల్లులు చెల్లించాలని.సర్పంచ్ భిక్షాటన

గోల్డెన్ న్యూస్ / హనుమకొండ :  పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ హనుమకొండ కలెక్టరేట్ ఎదుట  సర్పంచ్ భిక్షాటన చేశారు. వివరాల్లోకి వెళితే పరకాల నియోజకవర్గం నడికూడ తాజా మాజీ సర్పంచ్ ఊడ రవీందర్ రావు తాను చేసిన అభివృద్ధి పనుల బిల్లులు రాలేదంటూ హనుమకొండ కలెక్టరేట్ ఎదుట సోమవారం నిరసన వ్యక్తం చేసాడు. గత ప్రభుత్వం బిల్లులు వెంటనే విడుదల చేసేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో అప్పుల్లో కూరుకు పోయామని ఆవేదన వ్యక్తం చేస్తూ హనుమకొండ కలెక్టరేట్ ఎదుట బిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు.

Facebook
WhatsApp
Twitter
Telegram