గోల్డెన్ న్యూస్ / కౌడిపల్లి : రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ముగ్గురు దుర్మరణం చెందారని ఎస్సై రంజిత్రెడ్డి కథనం మేరకు. కుత్బుల్లాపూర్ మండలం సూరారం డివిజన్ కృష్ణానగర్కు చెందిన మహ్మద్ అలీ(50), అజీమాబేగం(45) దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు. పెద్ద కుమార్తె ఇరాన్ షాహీన్ కుమారుడు మహ్మద్ గౌస్(18 నెలలు) మనవడి పుట్టు వెంట్రుకలు తీసేందుకు 9 మంది కుటుంబ సభ్యులంతా కలిసి ఆదివారం రాత్రి మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలోని దర్గాకు బయలుదేరారు. మెదక్ నుంచి నర్సాపూర్ వైపు మరో కారు వస్తోంది. కౌడిపల్లి మండలం రాయిలాపూర్ శివారులో వెంకట్రావ్పేట గేటుమండలం రాయిలాపూర్ శివారులో వెంకట్రావ్పేట గేటు సమీపంలో పెద్ద వంతెన వద్ద అతివేగంగా ఎదురెదురుగా వచ్చిన రెండు కార్లు బలంగా ఢీకొన్నాయి. కారు నడుపుతున్న అహ్మద్ అలీ ఘటన స్థలంలోనే మృతిచెందగా.. మనవడు మహ్మద్ గౌస్ నర్సాపూర్ ప్రభుత్వాసుపత్రిలో, అమ్మమ్మ అజీమాబేగం సూరారంలోని మల్లారెడ్డి ఆసుపత్రిలో మృతి చెందారు. బాలుడి తల్లి ఇరాన్ షాహీన్, సమ్రీన్, సనాబేగం, మహ్మద్, నిలోఫర్, జునేరా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలిపారు.
