నేడు ఇంటర్ ఫలితాలు.

మధ్యాహ్నం 12 గంటలకు విడుదల

గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్ : ఇంటర్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు మంగళవారం రిలీజ్ కానున్నాయి. ఫస్టియర్ తో పాటు సెకండియర్ రిజల్ట్ ను ప్రకటించనున్నారు.ఇంటర్ బోర్డు ఆఫీసులో మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ రిలీజ్ చేయనున్నారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉండటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులు ఫలితాలను https://tgbie.cgg.gov.in, చూసుకోవచ్చు. కాగా,రాష్ట్రంలో మార్చి 5 నుంచి 25 వరకూ జరిగిన ఇంటర్ పరీక్షలకు 9.96 లక్షల మంది అటెండ్ అయ్యారు.

Facebook
WhatsApp
Twitter
Telegram