గోల్డెన్ న్యూస్ /విజయనగరం : విజయనగరంలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో దారుణం చోటుచేసుకుంది. ఓ విద్యార్థిని, లెక్చరర్‌ను కాలేజీ ఆవరణలో తోటి విద్యార్థులు చూస్తుండగా బూతులు తిడుతూ చెప్పుతో కొట్టింది. ఫోన్ తీసుకున్నందుకు ఆగ్రహించిన విద్యార్థిని, లెక్చరర్‌తో వాగ్వాదానికి దిగింది. అనంతరం, చెప్పుతో దాడి చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, విద్యార్థిని ప్రవర్తనపై నెటిజన్లు మండిపడుతున్నారు.
ఆ వీడియో రాష్ట్రం అంతా వైరల్ కావడంతో మనస్తాపం చెంది మహిళా ప్యాకల్టీ రాజీనామా.. తోటి ప్యాకల్టీలు వారించినప్పటికి తన రాజీనామా పత్రాన్ని మేనేజ్మెంట్ కు అందించినట్టు తెలిసింది
విద్యా సంస్థల చైర్మన్ రఘు ప్యాకల్టీలతో ప్రత్యేక సమావేశమైనట్టు నిర్వహించినట్టు సమాచారం
కాగా విద్యార్థిని తల్లిదండ్రులను కళాశాలకు రావాలని సమాచారం అందించినా ఇప్పటి వరకు కళాశాలకు రాకపోవడం గమనార్హం.