ఆర్టీసీ బస్సు కింద పడి మహిళ మృతి!

గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్ : బషీర్ బాగ్లో మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. బషీర్ బాగ్ నుంచి అబిడ్స్ వైపు కుమార్తెతో కలిసి ఆమె స్కూటీపై వెళుతుండగా.. గోల్కొండ హ్యాండిక్రాఫ్ట్స్ ఎదుట స్కూటీ అదుపుతప్పి కింద పడ్డారు. మహిళ తల పైనుంచి బస్సు చక్రాలు వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్టు తెలుస్తోంది. ఆమె కుమార్తెకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీకెమెరాలో రికార్డయ్యాయి.

Facebook
WhatsApp
Twitter
Telegram