ఆర్.ఎం.పి ముసుగులో అమ్మాయిలకు వల

గోల్డెన్ న్యూస్ /కాళ్ళ : ఈ ఫొటోలో కనిపించే వ్యక్తి గత కొద్ది కాలంగా కాళ్లలో ఆర్ఎంపీ వైద్యుడిగా ఉంటూ అతని వద్దకు వైద్యం కోసం వచ్చిన స్త్రీలను వశపరచుకొని శారీరకంగా అనుభవిస్తూ ఫోటోలు వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తూ అనేక సార్లు వారిపై లైంగిక దాడులు చేస్తున్న ఇతడు గతం లోనూ జువ్వలపాలెం, కాళ్ళకూరు, అనేక ప్రాంతాలలో ఈ విధమైన అకృత్యాలు చేస్తుంటే గ్రామస్తులు దేహశుద్ధి చేసి అక్కడ నుండి పంపించిన ఇతనికి బుద్ధి రాలేదని ప్రస్తుతం కాళ్ళ పరిసర ప్రాంతాల్లో ఇతను చేస్తున్న ఆకృత్యాలను సాక్షాదారాలతో తూర్పు ఉదయం పశ్చిమగోదావరి జిల్లా ప్రతినిధి హనుమంతరావు కమ్మిలకి తెలియజేయడం జరిగింది. ఇతని చేతిలో అనేకమంది కాలేజీ విద్యా ర్థులు,, స్త్రీ లు ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారని, ప్రస్తుతం ఇతను పరారీలో ఉన్నాడని, ఈ మోసగాడిని ఎవరు నమ్మవద్దని ఎవరి కైనా ఇతను కనిపిస్తే దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్ కు తెలియచేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram