గోల్డెన్ న్యూస్ / మహబూబాబాద్ : మీ కాళ్లకు దండం పెట్టి అడుగుతున్నా మీ పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించి ప్రయోజకులను చేయండని వేడుకుంటున్న ఉపాధ్యాయుడు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కల్వల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కళ్లెం వీరారెడ్డి మంగళవారం బడిబాటలో భాగంగా తన ఉపాధ్యాయ బృందంతో కలిసి ఉపాధి హామీ కూలీలు పనిచేసే ప్రదేశానికి వెళ్లారు.మీ కాళ్లకు దండం పెట్టి అడుగుతున్నా. మీ పిల్లలను ప్రభుత్వ బడిలో చదివించి ప్రయోజకులను చేయండి అని వేడుకున్న సంఘట వేడుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలో అర్హత, అనుభవం కలిగిన ఉపాధ్యాయులు ఉంటారని.. కష్టపడి కూలీ పనిచేసి సంపాదించిన రూపాయలను పిల్లల చదువు కోసం ప్రైవేటు పాఠశాలలకు ధారపోయకూడదన్నారు. మీ పిల్లలకు చదువు రాకపోతే తమను నిలదీయాలని భరోసా కల్పించారు. ప్రధానోపాధ్యాయుడి ఆవేదనను చూసి చలించిన కూలీలు, తమ పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పిస్తామని చెప్పారు. మొదటి రోజు 14 మంది, రెండో రోజు 17 మంది విద్యార్థులు బడిలో చేరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గోపి, స్వరూప, హరేకృష్ణ, కృష్ణ, శ్రీదేవి, మోహనకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
