ప్రశాంతంగా కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

గోల్డ్ న్యూస్ /హైదరాబాద్: హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. బుధవారం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. భాజపా అభ్యర్థి గౌతంరావు, ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫెండి పోటీలో ఉన్నారు. ఎక్కువ ఓటర్లున్న ఎంఐఎం పార్టీ ఎన్నికను ఏకగ్రీవం చేసుకుంటుందని మొదట్లో అంతా భావించారు. అనూహ్యంగా భాజపా పోటీలోకి దిగడంతో ఎన్నిక అనివార్యమైంది. అలాగే.. ఎన్నికల ప్రచారంలోనూ ఆ పార్టీ దూకుడుగా వ్యవహరించింది. మరోవైపున భారాస పార్టీ తమ కార్పొరేటర్లను ఓటుకు దూరంగా ఉండాలంటూ ఆదేశాలిచ్చింది. పోలింగ్కు దూరంగా ఉండాలని విప్ జారీ చేసింది. కాంగ్రెస్ పార్టీ మాత్రం.. తమ కార్పొరేటర్లు ఓటింగ్లో పాల్గొంటారని తెలిపింది.

Facebook
WhatsApp
Twitter
Telegram