గోల్డెన్ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం : తెలంగాణ హైకోర్టు ఉత్తర్వుల మేరకు కొత్తగూడెం జిల్లా ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జిగా కె. కిరణ్ కుమార్ బుధవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. సత్తుపల్లి సీనియర్ సివిల్ జడ్జిగా విధులు నిర్వహిస్తున్న మీరా ఖాసీం వద్ద నుంచి ఆయన బాధ్యతలు చేపట్టారు.
గతంలో హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో మొదటి అదనపు జడ్జిగా పనిచేసిన కిరణ్ కుమార్, బదిలీపై కొత్తగూడెం వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు.
అనంతరం కొత్తగూడెం న్యాయవ్యవస్థకు చెందిన పలువురు ప్రముఖులు కిరణ్ కుమార్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. రెండోవ అదనపు జ్యూడిషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ కే. సాయి శ్రీ, ప్రత్యేక జ్యూడిషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ మెండు రాజమల్లు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి బాగం మాధవరావు, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు మోహన్ దాస్, కిరణ్ కుమార్, జిల్లా న్యాయశాఖ అధ్యక్షుడు రామిశెట్టి రమేష్, నిమ్మల మల్లికార్జున్ తదితరులు ఆయనకు అభినందనలు తెలిపారు.