గోల్డెన్ న్యూస్ /శంకరపట్నం : వరంగల్ – కరీంనగర్ జాతీయ రహదారిపై కొత్తగట్టు గ్రామ శివారులో బుధవారం ఆర్టీసీ బస్సు కారుని ఢీకొట్టింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ ఒకటో డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు 60 మంది ప్రయాణికులతో హనుమకొండ నుంచి నిజామాబాద్ వెళ్తుండగా కొత్తగట్టు గ్రామ శివారు చేరుకోగానే అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు, బస్సు ముందు భాగాలు దెబ్బతిన్నాయి. కారులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. కారులో ఉన్నవారు ఓ పెళ్లి వేడుకకు హాజరయ్యేందుకు వెళ్తున్నారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
Post Views: 21