గోల్డెన్ న్యూస్ / మెదక్ : జమ్మూ కాశ్మీర్/లోని పహల్గామ్ ప్రాంతంలో ఇటీవల హిందూ సోదరులపై జరిగిన దారుణ ఉగ్రదాడికి నిరసనగా, మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించారు. బుధవారం సాయంత్రం జరిగిన ఈ ర్యాలీ హిందూ ధార్మిక సంస్థల ఆధ్వర్యంలో, రాజకీయాలకు అతీతంగా సాగింది. అన్ని రాజకీయ పార్టీల నేతలు, హిందూ బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొని సంఘీభావం తెలిపారు.
నల్ల రిబ్బన్లతో చేతులను కట్టుకొని తూప్రాన్ మహంకాళి దేవాలయం నుండి ప్రారంభమైన ఈ నిరసన ర్యాలీ పట్టణ ప్రధాన వీధుల గుండా సాగింది. పాకిస్తాన్ ప్రోత్సాహంతో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ ప్రజలు గట్టిగావేసిన నినాదాలు ప్రాంతాన్ని హోరెత్తించాయి. ఈ కార్యక్రమంలో భాగంగా, ఉగ్రవాదాన్ని అణచివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ పలువురు ప్రసంగించారు.
ర్యాలీలో భూమన్నగారి జానకిరామ్ గౌడ్, బండారు దుర్గారాజు యాదవ్, స్వర్గం వెంకట నారాయణ, తాటి విఠల్, కే.వేణుగోపాల్, భాస్కర్, రామునిగారి మహేష్ గౌడ్, అర్.అశోక్ కుమార్ గౌడ్, ఆడేపు మధుసూదన్, బొంది రమేష్ గౌడ్, దోమలపల్లి ఆంజనేయులు, మామిండ్ల శ్రీశైలం, నాగులపల్లి సిద్ధిరాములు యాదవ్, పోల శ్రీనివాస్ గుప్త, కోడిప్యాక సంతోష్ గుప్త, పసుల నారాయణ తదితరులు పాల్గొన్నారు.
నిరసన ర్యాలీ సందర్భంగా తూప్రాన్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ జీ.శివానందం ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది.