గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్ : జపాన్ పర్యటన ముగించుకొని సీఎం రేవంత్ రెడ్డి, బుధవారం రాత్రి హైదరాబాద్ కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు.
దాదాపు 7 రోజుల పాటు జపాన్ లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి బృందం.. అక్కడ పలు పారిశ్రామిక సంస్థలతో రూ.12,062 కోట్ల పెట్టుబడుల ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఇక ఈనెల 25, 26న హైదరాబాద్ వేదికగా జరగనున్న ‘భారత్ సమ్మిట్ ఏర్పాట్లపై ఈరోజు మంత్రులు, ఉన్నతాధి కారులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు.
Post Views: 75