గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్ : కాలేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై విచారం చేస్తున్న కమిషన్ ఈరోజు నుంచి రెండో దశ దర్యా ప్తును ప్రారంభించనుంది, జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిషన్ ఇప్పటికే మొదటి దశలో ప్రాథమికంగా విచారణ నిర్వహించింది ఇప్పుడు రెండో దశలో మరింత లోతుగా దర్యాప్తు జరుపునుంది,
గత ప్రభుత్వంలో సదరు ప్రాజెక్టుల నిర్మాణాలకు బాధ్యులుగా వ్యహరించిన వారికి నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఆ సమయం లో కీలక పదవుల్లో ఉన్న అధికారులకు నోటీసులు జారీ చేసి వారి స్టేట్‌మెంట్ ను రికార్డ్ చేయనున్నారు.
ముఖ్యంగా ప్రాజెక్టు నిర్మాణ సమయంలో తీసుకున్న నిర్ణయాలు, ఖర్చు చేసిన నిధులపై మలిదశ విచారణలో ప్రధానంగా ఆరా తీయనున్నట్లుగా సమాచారం.
అయితే, ఈ నెలాఖరుతో కాళేశ్వరం కమిషన్ గడువు ముగియనుండటంతో మరో రెండు నెలల వ్యవధితో గడువును పొడిగిస్తూ సీఎస్ శాంతి కుమారి,అధికారిక ఉత్తర్వులు జారీ చేయను న్నట్లుగా విశ్వసనీయంగా తెలుస్తోంది.