గోల్డెన్ న్యూస్ / మహబూబాబాద్ : కొత్తగూడ మండలంలోని పెగడపల్లి వద్ద తీవ్ర విషాదం నెలకొంది. దుర్గారం గ్రామానికి చెందిన అక్కాచెల్లెళ్లు జంగా మౌనిక, నవ్య ఇరువురు ఇంటర్ పరీక్షల ఫలితాలు వచ్చిన ఆనందంలో మిత్రుడి పుట్టినరోజు కోసం పొగుళ్లపల్లికి బైక్ పై వెళ్తున్నారు. ఈ క్రమంలో ఎదురుగా వచ్చిన ట్రాలీ ఆటో ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. వీరి అకాల మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి
Post Views: 34