గోల్డెన్ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం : ఆయిల్ ఫెడ్ ఛైర్మన్ జంగా రాఘవరెడ్డి, అధికారులతో కలిసి గురువారం అశ్వరావుపేట ఆయిల్ పామ్ తోటలను పరిశీలించారు.ఆఫ్ టైపు మొక్కలు రావడానికి కారణాలు ఏమిటో తెలుసుకునేందుకు విశ్రాంత శాస్త్రవేత్త బీఎన్రావును వెంట బెట్టుకొని తోటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైతులకు నాణ్యమైన మొక్కలు సరఫరా చేయకపోవడం వల్లనే దిగుబడి తగ్గుతోందని ఆయన పేర్కొన్నారు. దీనిపై ఛైర్మన్ రాఘవరెడ్డి మాట్లాడుతూ.. నర్సరీ దశలో జరిగిన కొన్ని లోపాల వల్లే ఈ సమస్య వచ్చిందని ఒకే రైతు తోటలో కొన్ని మొక్కలు మంచిగా కాసి, మరికొన్ని గెలలు రాకపోవడం ఎందుకనేది ఒక్క రోజలో చెప్పలేము అని వివరించారు ఆయన వెంట డిప్యూటీ మేనేజర్ ప్రవీణ్ రెడ్డి, డీఓ లు రాధాకృష్ణ, శభావతు శంకర్, తదితరులు ఉన్నారు.
Post Views: 27