గోల్డ్ న్యూస్ / బాన్సువాడ: | కామారెడ్డి కలెక్టర్ మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ బాధితులను తన కారులో ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. గురువారం నస్రుల్లాబాద్లో భూభారతి సదస్సులో కలెక్టర్ ఆశిస్ సంగ్వాన్ పాల్గొని కామారెడ్డికి తిరిగి వెళ్తున్నారు.
అదే సమయంలో నస్రుల్లాబాద్ మండలం బొమ్మన్దేవ్పల్లి చౌరస్తా వద్ద ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. ఈ ఘటనను గమనించిన కామారెడ్డి కలెక్టర్ వెంటనే తన వాహనాన్ని ఆపారు. బాధితులతో మాట్లాడి తన వెంట ఉన్న డీపీఆర్వో వాహనంలో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
Post Views: 26