గోల్డెన్ న్యూస్ /హైదరాబాద్ : పహల్గామ్ ఉగ్రవాదులు సృష్టించిన నరమేధంలో 26 మంది అసువులు బాసిన నేపథ్యంలో AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ముస్లింలకు కీలక పిలుపునిచ్చారు.
రేపు శుక్రవారం ముస్లింలంతా నల్ల రిబ్బన్లు ధరించి నమాజ్ చేయాలని కోరారు. ఉగ్రదాడికి నిరసనగా దీన్ని పాటించాలని విన్నవించారు. మరోవైపు, ఉగ్రదాడిని తీవ్రంగా పరిగణించిన కేంద్రం తదుపరి కార్యాచరణపై కేంద్రమంత్రి రాజ్నాథ్ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించగా, ఒవైసీ పాల్గొన్నారు.
Post Views: 29