పాక్ సైన్యం చేతిలో బందీగా బీఎస్ఎఫ్ జవాన్

పహల్గాం ఉగ్ర దాడి ఘటనతో భారత్- పాకిస్తాన్, మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి భారత జవాన్ ను పాకిస్తాన్ బందీగా చేసుకుంది భారత్ సరిహద్దుల్లో బిఎస్ఎఫ్ జవాన్ ను పాకిస్తాన్ ఆర్మీ బంధించింది, తమ భూ భాగంలోకి ప్రవేశించాడని పాకిస్తాన్ ఆరోపించింది..

 

జమ్మూకాశ్మీర్లో పహల్గం ఉగ్రదాడి మరవక ముందే పాకిస్తాన్ మరో దుందు డుకు చర్యకు పాల్పడింది. భారత్ కు చెందిన ఓ జవానును పాక్ బంధీగా చేసుకుందని సమాచారం. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కు చెందిన ఓ జవాను పాక్ సైన్యం చేతిలో బంధీ అయినట్టు భద్రతా బలగాల అధికారులు పేర్కొన్నారు.

 

సైనికుడు తమ భూభాగం లోకి రావడం వల్లే అదుపు లోకి తీసుకున్నామని పాక్ ఆర్మీ వెల్లడించింది. అయితే పాక్ వ్యాఖ్యలను BSF అధికారులు ఖండించారు. తమ జవాను సరిహద్దు దాటలేదని, తప్పుడు ఆరోపణలతో పాక్ సైన్యం తమ సైనికుడిని బంధీగా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

తక్షణమే తమ జవానును విడుదల చేయాలని, లేదంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఉన్నతాధికారులు! స్పష్టం చేశారు. కాగా పహల్గాం ఉగ్రదాడితో ఇరు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఏర్పడగా.. పాక్ ఇలాంటి చర్యకు పాల్పడటం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో అని మీడియాలో జోరుగా చర్చ నడుస్తుంది..!

Facebook
WhatsApp
Twitter
Telegram