న్యాయవాదులు నల్ల బ్యాడ్జీలతో నిరసన

గోల్డెన్ న్యూస్ / వరంగల్ :  పహాల్గాంలో ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ గురువారం వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈసందర్భంగా వారు కోర్టు విధులను బహిష్కరించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. “హిందువులపై దాడి చేసిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలి. ఇలాంటి సంఘటన పురావృతం కాకుండా కఠిన చర్యలు చేపట్టాలి” అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ బాధ్యులతో పాటు పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram